నవరస నటనా సార్వభౌముడు కైకాల కన్నుమూత
on Dec 23, 2022
నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం (డిసెంబర్ 23) తెల్లవారుజామున కన్నుమూశారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన కైకాల సత్యనారాయణ మృతి వార్తతో ఇరు తెలుగు రాష్ట్రాలు దిగ్భాంతికి గురయ్యాయి. వెండి తెరపై యముడి పాత్రకు కైకాల సత్యానారయణ తర్వాతే ఎవరైనా..! ఆ స్థాయిలో ఆయన యముడి పాత్రలో ఒదిగారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతో సత్యనారాయణ నటించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కైకాల ప్రవేశించారు. తెలుగు దేశం పార్టీలో చేరి 1996లో మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత 1998లో లోక్ సభకు మళ్లీ ఎన్నికలు జరగ్గా పోటీ చేసి. కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన అటు రాజకీయాలలోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ వివాద రహితుడిగా పేరొందారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
