చిరుతో సినిమా చేసి తీరతానంటున్నాడు!
on Jun 26, 2016

చిరంజీవితో ఎలాగైనా సరే సినిమా తీయాలన్న పట్టుదలతో ఉన్నాడు పూరి జగన్నాథ్. 150వ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆటోజాని టైటిల్, కథ చిరుకి బాగా నచ్చినా.. సెకండాఫ్ సరిగా కుదరకపోవడంతో ఆ సినిమాని పక్కన పెట్టేశాడు. అయితే ఎప్పటికైనా సెకండాఫ్ చిరుకి నచ్చినట్టు తీర్చిదిద్దుతా అంటున్నాడు పూరి. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వలేదని ఎప్పటికైనా చిరుతో కలసి ఓ సినిమా తీస్తానని.. అది ఆటోజానీనే అయ్యే అవకాశాలున్నాయని అంటున్నాడట. చిరు కూడా ఆటోజానీపై ప్రేమ పెంచుకొన్నట్టు తెలుస్తోంది. ఆ కథ తన బాడీ లాంగ్వేజ్‌కి సరిగ్గా సూటవుతుందని భావిస్తున్నాడట. అన్నీ కుదిరితే 151వ సినిమా అదే అవుతుందని టాక్. ఒకవేళ పూరి గనుక డైరెక్టర్ గా కన్ఫర్మ్ అయితే కొత్తగా నిర్మాతను వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ మధ్య ఓ ఫంక్షన్ లో అల్లు అరవింద్ స్వయంగా చిరు 151 వ సినిమా ప్రొడ్యూస్ చేసేది నేనే అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే చిరు మరో సెన్సేషన్ కు తెర తీయడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



