రజనీతో వర్క్ చేసే అవకాశం పోగొట్టుకొన్నాను: పరుచూరి గోపాలకృష్ణ
on Jun 26, 2016

రజనీకాంత్ సినిమాకి పనిచేసే అవకాశం కోసం ఎంతటివారైనా వేచి చూస్తుంటారు. అవకాశం రావడమే చాలు దాదాపుగా ఎగిరి గంతులు వేస్తుంటారు. కానీ మన తెలుగు స్టార్ రచయితల ద్వయం పరుచూరి బ్రదర్స్ మాత్రం రజనీ పిలిచి మరీ అవకాశం ఇచ్చినా చేజేతులా వదులుకొన్నారట. ఈ విషయాన్ని పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ "కబాలి' ఆడియో వేడుకలో తెలిపారు. రజనీకాంత్ నటించిన "బాబా" సినిమాకి తెలుగు వెర్షన్ డైలాగులు వ్రాయమని స్వయంగా రజనీకాంత్ మన పరుచూరి బ్రదర్స్ ను కోరగా.. "లిప్ సింక్ లో డైలాగ్స్ వ్రాయడం మాకు రాదు, మేం చేయలేం" అంటూ రజనీ సినిమాకి పనిచేసే సువర్ణావకాశాన్ని సున్నితంగా తిరస్కరించారట!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



