రియా పక్కింటామె.. చానల్స్ దగ్గర చూశానంది.. సీబీఐ దగ్గర చూడలేదంది!
on Oct 12, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం రియా చక్రవర్తి పక్కింటామె డింపుల్ తవానీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. రియా, సుశాంత్‌లను జూన్ 13న జంటగా తాను చూశానని ఆమె ఇదివరకు చానల్స్‌తో మాట్లాడుతూ చెప్పింది. జూన్ 14న సుశాంత్ తన ఫ్లాట్‌లో ఉరివేసుకొని కనిపించాడు. కాగా, డింపుల్‌ను తాము ప్రశ్నించిందీ, లేనిదీ ధ్రువీకరించడానికి సీబీఐ ప్రతినిధి ఆర్.కె. గౌర్ తిరస్కరించారు. "సుశాంత్ మృతికి సంబంధించి సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మృతికి సంబంధించి అవకాశమున్న అన్ని కోణాలనూ, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నాం." అని ఆయన చెప్పారు.
అయితే సీబీఐ ప్రశ్నించిన సందర్భంలో జూన్ 13న తాను సుశాంత్, రియాలను జంటగా చూడలేదనీ, కానీ ఎవరో చెప్పుకుంటుండగా విన్నాననీ తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. టీవీ చానల్స్‌తో డింపుల్ తవానీ అబద్ధాలు చెప్పారని రియా లాయర్ సతీశ్ మనేషిండే ఆరోపించారు. దర్యాప్తును తప్పుదారి పట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీబీఐని ఆయన కోరారు.
"ఎలక్ట్రానిక్ మీడియాలో ఫేక్ న్యూస్ ద్వారా రెండు నిమిషాలు కనిపించడం కోసం రియా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన, ఆమెకు చెడ్డపేరు తీసుకొచ్చిన వారిని గుర్తిస్తున్నాం. అలాంటి వారిలో డింపుల్ ఒకరు. తను సుశాంత్ అభిమానిననీ, గత జన్మ బంధం ద్వారా తను అతడికి సోల్‌మేట్ అని ఆమె నమ్ముతోంది. 13న రియాను సుశాంత్ ఆమె ఇంటిదగ్గర దింపాడని ఎవరో తనకు చెప్పారని ఆమె అంటోంది." అని మీడియాపర్సన్స్‌కు చేసిన టెక్స్ట్ మెసేజ్‌లో సతీశ్ తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



