Home

»

Latest News

`ఆర్ ఆర్ ఆర్`తో తార‌క్ పొంగ‌ల్ హ్యాట్రిక్ ప్లాన్!

Dec 1, 2021 11:07AM

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ వెండితెర‌పై వెలుగులు పంచి చాన్నాళ్ళే అవుతోంది. 2018 ద‌సరాకి స‌ర‌దాలు పంచిన `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` త‌రువాత తార‌క్ మ‌ళ్ళీ బిగ్ స్క్రీన్ పై సంద‌డి చేయ‌నేలేదు. మూడేళ్ళ‌కు పైగా భారీ విరామంతో `ఆర్ ఆర్ ఆర్`తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు ఈ నంద‌మూరి స్టార్.  ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో `స్టూడెంట్ నెం.1`, `సింహాద్రి`, `య‌మ‌దొంగ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్  త‌రువాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావ‌డంతో.. `ఆర్ ఆర్ ఆర్`పై స్కై హై ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ఈ పాన్ - ఇండియా మూవీ థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

"సీతారాముడి సాహిత్యం నాతో శివ‌తాండ‌వం చేయించింది"..

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. కెరీర్ ఆరంభంలో తార‌క్ కి పొంగ‌ల్ సీజ‌న్ అంత‌గా అచ్చిరాక‌పోయినా.. గ‌త కొంత‌కాలంగా మంచి విజ‌యాలే ఉన్నాయి. `అదుర్స్` (2010), `నాన్న‌కు ప్రేమ‌తో` (2016).. ఇలా సంక్రాంతి సీజ‌న్ లో ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన చిత్రాలు స‌క్సెస్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో.. `ఆర్ ఆర్ ఆర్` కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేసి తార‌క్ కి పొంగ‌ల్ హ్యాట్రిక్ ని అందిస్తుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com