సీతారామశాస్త్రి ఆకస్మిక మృతితో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల వాయిదా!
on Dec 1, 2021

యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న పీరియడ్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ విడుదలను మేకర్స్ వాయిదావేశారు. డిసెంబర్ 3న ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకు వారు ప్రకటించారు. అయితే లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మృతితో ట్రైలర్ విడుదలను వాయిదా వేయాలని మూవీ టీమ్ నిర్ణయించింది. 'ఆర్ఆర్ఆర్'లో "దోస్తీ" పాటను రచించింది సీతారామశాస్త్రే.
బుధవారం 'ఆర్ఆర్ఆర్' మూవీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్, "అనుకోని పరిస్థితుల కారణంగా డిసెంబర్ 3న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌ను మేం రిలీజ్ చేయడం లేదు. అతి త్వరలో కొత్త డేట్‌ను ఎనౌన్స్ చేస్తాం" అని వెల్లడించింది.
అంతకుముందు సీతారామశాస్త్రి మృతికి నివాళులర్పిస్తూ మంగళవారం, "మిత్రమా అని నోరారా పిలిచే కంఠం మూగబోయింది. 'దోస్తీ' పాటను మాకిచ్చిన చేయి ఇక కలం పట్టనంది. ఊహించని చేదునిజం గుండెను పిండేసినా ఆ కవనాలతో ఊపిరి పోసుకున్న పాటల తోడులోని తీపిని హృదయాలలో ధరిస్తూ, స్మరిస్తూ, తరిస్తూ ఈ అశ్రు నివాళి - ఆర్ఆర్ఆర్ చిత్రబృందం" అనే నోట్‌ను ఆ హ్యాండిల్ పోస్ట్ చేసింది.
Also read: రామ్‌చరణ్, ఆలియా భట్‌పై ప్రమోషనల్ సాంగ్?
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ ప్రధాన తారాగణమైన 'ఆర్ఆర్ఆర్' 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో విడుదల కానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



