బాలయ్యను సరిగ్గా చూపించడం బోయపాటికే సాధ్యం!
on Nov 15, 2025

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన సినీ కెరీర్ లో ఎందరో దర్శకులతో పని చేశారు. ఎన్నో వైవిద్యభరితమైన సినిమాలలో నటించారు. అయితే ఈ జనరేషన్ కి బాలకృష్ణ పేరు వింటే.. మొదట గుర్తుకొచ్చే దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్యను ఎలా చూపించాలో తనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేలా బోయపాటి పేరు సంపాదించుకున్నారు. (Boyapati Srinu)
అది 2010. బాలకృష్ణ స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైందన్న నిరాశ అభిమానుల్లో ఉంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలతో సంచలనాలు సృష్టించిన బాలయ్య.. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలను చూడలేదు. మధ్యలో చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీనరసింహా వంటి సినిమాలు మాత్రమే ఊరటను ఇచ్చాయి. విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు రూపంలో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఇక బాలకృష్ణ పనైపోయింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అలాంటి తరుణంలో బాలయ్యను మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర సింహంలా గర్జించేలా చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను. (Akhanda 2 Thaandavam)

అప్పటికే భద్ర, తులసి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరుపొందిన బోయపాటి.. తన మూడవ సినిమాను బాలకృష్ణతో చేశారు. అదే సింహా. ఈ సినిమాతో డైరెక్టర్ గా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. బాలకృష్ణను అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. సింహాలో బాలయ్యను బోయపాటి ప్రజెంట్ చేసిన తీరుకి అందరూ ఫిదా అయ్యారు. బాలయ్య లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ ల్యాంగ్వేజ్ కట్టిపడేశాయి. ఇలా కదా నటసింహాన్ని చూడాలనుకుంది అంటూ అభిమానులు మురిసిపోయారు. గత కొన్ని సినిమాల్లో బాలయ్య లుక్స్ పై వచ్చిన ట్రోల్స్ కి కూడా.. సింహా చెక్ పెట్టింది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, బాలకృష్ణ అభిమానుల హృదయాల్లో బోయపాటికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది.

సింహా తర్వాత సరిగ్గా నాలుగేళ్లకు బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో రెండవ సినిమాగా 'లెజెండ్' వచ్చింది. సింహా మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఆ స్థాయిలో మళ్ళీ బాలకృష్ణను చూపించడం సాధ్యమేనా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. సింహాకి మించిన రేంజ్ లో లెజెండ్ లో చూపించారు. దాంతో బాలకృష్ణను సరిగ్గా చూపించాలంటే బోయపాటికే సాధ్యం అనే అభిప్రాయం మరింత బలపడింది.
.webp)
సింహా, లెజెండ్ తరువాత బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'అఖండ'పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం సాధ్యమేనా అనే సందేహాలను బద్దలుకొడుతూ సంచలనం సృష్టించారు బోయపాటి. అఘోరగా బాలకృష్ణను ఆయన చూపించిన తీరుకి.. నందమూరి అభిమానులే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కోవిడ్ పాండమిక్ టైంలో.. లో-ఆక్యుపెన్సీ, తక్కువ టికెట్ ధరలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కాసుల వర్షం కురిపించింది.

ఇప్పుడు బాలయ్య-బోయపాటి కాంబోలో 'అఖండ-2' వస్తోంది. డిసెంబర్ 5న రానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రచార చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 'అఖండ'ను మించి 'అఖండ-2'లో మరింత పవర్ ఫుల్ గా బాలకృష్ణను బోయపాటి చూపించబోతున్నారని ఇప్పటికే అర్థమైపోయింది. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య-బోయపాటిల అఖండ తాండవం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయిపోయారు. దీని తర్వాత కూడా బాలకృష్ణతో బోయపాటి మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



