ప్రభాస్ తల్లిగా సల్మాన్ హీరోయిన్
on Jan 22, 2020
ప్రస్తుతం ప్రభాస్ ఓ ప్రేమకథా చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అతనికి తల్లిగా హీరోగా సల్మాన్ ఖాన్ ఫస్ట్ సినిమా 'మైనే ప్యార్ కియా'లో హీరోయిన్ నటిస్తోంది. ఆవిడ పేరు భాగ్యశ్రీ. తెలుగులో 'ప్రేమ పావురాలు'గా విడుదలైన 'మైనే ప్యార్ కియా' మంచి విజయం సాధించింది. అప్పట్లో ఆ సినిమా పాటలు ఎక్కడ చూసినా మార్మోగాయి. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమే.
చాలా సంవత్సరాల విరామం తర్వాత భాగ్యశ్రీ నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది అని చెప్పవచ్చు. 20 ఏళ్ల క్రితం రాజశేఖర్ 'ఓంకారం'లో ఆమె నటించారు. రెండేళ్ల క్రితం '2 స్టేట్స్' రీమేక్ కి సంతకం చేశారు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం భాగ్యశ్రీ దొరికింది. ప్రభాస్, భాగ్యశ్రీ మధ్య సన్నివేశాలు భావోద్వేగ భరితంగా ఉంటాయని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. ఆ సెట్ ఖరీదు సుమారు మూడు కోట్ల రూపాయలట. ఇక్కడ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి అవుట్ డోర్ షూటింగ్ చేయడానికి ప్రభాస్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నారు.