ENGLISH | TELUGU  

"తెర‌పై నీ డాన్స్ అదిరింది మ‌చ్చా".. శివాజీరాజా త‌న‌యుడికి స‌న్నీ ప్ర‌శంస‌!

on Jan 6, 2022

శివాజీరాజా కుమారుడు విజ‌య్ రాజా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం వేయి శుభ‌ములు క‌లుగునీకు ఈనెల 7న విడుద‌ల‌వుతోంది. త‌మ‌న్నా వ్యాస్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని రామ్స్ రాథోడ్ డైరెక్ష‌న్‌లో జ‌య‌దుర్గాదేవి మ‌ల్టీ మీడియా బ్యాన‌ర్‌పై న‌ర‌సింహ ప‌టేల్‌, జామి శ్రీ‌నివాస‌రావు సంయుక్తంగా నిర్మించారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్రం చౌద‌రి, హీరోలు ఆకాశ్ పూరి, మేఘాంశ్ శ్రీ‌హ‌రి, బిగ్ బాస్ 5 విన్న‌ర్ స‌న్నీ, న‌టుడు విశ్వ త‌దితరులు పాల్గొని సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఫ్యామిలీ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా" అన్నారు. 

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. "ట్రైలర్ అమేజింగ్ గా ఉంది. ఇందులో మీ అందరి హార్డ్ వర్క్ కనిపిస్తుంది. విజ‌య్ రాజ్ ఇలాగే మంచి మంచి సినిమాలు చేయాలని కోరుతున్నాను. ఈ నెల 7న వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాత లకు మంచి పేరు తీసుకు రావాలని కోరుతున్నాను" అన్నారు. 

బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ మాట్లాడుతూ.. "శివాజీ రాజా గారు అందరికీ ఇష్టమైన వ్యక్తి తను నిన్ను తెరపై చూడాలి అనుకున్నాడు. కానీ మచ్చా.. తెరపై నీ డ్యాన్స్ అదిరింది మచ్చా.. దీని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉందో తెలుస్తుంది. దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కుండా తీశారని ట్రైలర్, పాటలు, ఫైట్స్ చూస్తే తెలుస్తుంది." అని అన్నారు. 

బిగ్ బాస్ విశ్వ, మేఘాంశ్‌ శ్రీహరి మాట్లాడుతూ.. "విజయ్ రాజా డ్యాన్స్ చేస్తున్నపుడు సైడ్ నుండి చూస్తుంటే అఖిల్ లా అనిపిస్తున్నావు. తను చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి" అన్నారు. 

చిత్ర దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ..  చిత్రంలో ఫాదర్, సన్ ల మీద సాగే సెంటిమెంట్ సాంగ్ చూస్తే.. తండ్రి కొడుకు ల మధ్య ఇంత రిలేషన్ ఉంటుందా అనేలా అద్భుతంగా ఉంటుంది.ఈ సాంగ్ ను చూసిన వారంతా ఆ సాంగ్ కు కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకు మాకు చక్కటి హీరో దొరికాడు. మేము రమ్మన్న టైం కంటే ముందే సెట్ లో ఉండేవాడు. హీరోయిన్ చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులోని పాటలన్నీటికీ మంచి వ్యూస్ వచ్చాయి. టెక్నీషియన్స్, ఆర్టిస్టు లు అందరూ బాగా సపోర్ట్ చేస్తూ సహరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. నేను చెప్పిన కథను నన్ను నమ్మి  నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా బడ్జెట్ కు కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో ఈ పండుగ వాతావరణంలో ఈ నెల 7 న వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను" అన్నారు. 

చిత్ర నిర్మాతలు తూము నరసింహ పటేల్,  జామి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం “వేయి శుభములు కలుగు నీకు”. మంచి కంటెంట్ తో  సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి  బడ్జెట్ గురించి ఆలోచించకుండా తీశాము. దీనిలో ఐదు సాంగ్స్ ఉంటాయి. అన్ని పాటలకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫుల్ యాక్షన్, థ్రిల్లర్ గా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. థ్రిల్లర్ మూవీ. ఈ రోజుల్లో మంచి సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఒక్క సెన్సార్ కట్ లేకుండా మాకు సెన్సార్ ఇచ్చారు. అని తెలిపారు.

హీరో విజయ్ రాజా మాట్లాడుతూ.. "మా చిత్ర దర్శకుడు చాలా కష్టపడి మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశాడు. ఈ చిత్ర షూటింగ్ టైం లో కోవిడ్ సమస్య వున్నా కూడా నాలాంటి చిన్న హీరోకు ఇంత బడ్జెట్ అవసరమా అని చూడకుండా చిత్ర నిర్మాతలు అనుకున్న దానికంటే ఎక్కువ ఖ‌ర్చుపెట్టారు. దర్శకుడు చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని మాతో మంచి చిత్రాన్ని చేశారు. జూన్ 7న వస్తున్న మా సినిమాను అందరూ ఆద‌రించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను" అన్నారు.

చిత్ర హీరోయిన్ తమన్నా వ్యాస్ మాట్లాడుతూ.. "ఇందులోని పాటలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.