కిడ్నాప్ తర్వాత భావన మొదటి మెసేజ్
on Feb 28, 2017
ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులు సహజం. కష్టాలకు భయపడకుండా ఎదురెళ్ళేవారే జీవితంలో విజేతలుగా నిలుస్తారు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతాం. అలాంటిది, కిడ్నాప్ అయిన వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుంది. అదే, ఆ వ్యక్తి ఒక అమ్మాయి అయితే.. ఇంకా చెప్పాలి అంటే తాను హీరోయిన్ అయితే. ధైర్యం లేని వాళ్లయితే, ఏ దారుణానికి అయినా ఒడిగట్టొచ్చు. కానీ, కిడ్నాప్ కి గురై, అగంతకులతో నరకం చూసిన భావన తాను ధైర్యవంతురాలినని ప్రూవ్ చేస్తూ, ఈ మధ్యే ఒక సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టింది. ఆడం అనే ఈ సినిమాలో కథానాయకుడిగా చేస్తున్న పృథ్వీరాజ్‌తో సహా పలువురు మాలీవుడ్ సినీ ప్రముఖులు భావన ధైర్యానికి పొగడ్తలతో ముంచెత్తారు.
కిడ్నాప్ తర్వాత భావన సోషల్ మీడియాలో మొదటి మెసేజ్ పెట్టింది. "జీవితంలో నేను కొన్ని సార్లు కింద పడ్డ సందర్భాలున్నాయి. నేను ఊహించని పరిస్థితులు చవి చూసాను. బాధలు పడ్డాను, అపజయాలు ఎదుర్కొన్నాను. కానీ, ఒకటి మాత్రం నిజం, నేనెప్పుడూ వాటిని సమర్ధంగా ఎదుర్కొన్నాను. నా మీద ఇంత ప్రేమ కురిపించిన, నా కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు," అని పోస్ట్ చేసింది భావన. చాల మంది పిరికివాళ్ళకి భావన మెసేజ్ ఒక కనువిప్పు. ఆమెని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏమంటారు!
Also Read