భరత్ అను నేను 26న ఏం చెప్పబోతున్నాడు..?
on Jan 24, 2018

వరుస ఫ్లాపుల్లో ఉన్న మహేశ్ బాబు ఈ సారి గట్టి హిట్ కొట్టి ఫ్యాన్స్‌కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాడు. దీనిలో భాగంగా తనకు శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కొరటాల శివకు హిట్ ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. వీరిద్దరి కాంభినేషన్‌లో వస్తోన్న మూవీ "భరత్ అను నేను". పొలిటికల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. షూటింగ్ పార్ట్ చాలా వరకు కంప్లీటైన ఈ మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎగ్జయిటింగ్‌తో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది చిత్ర యూనిట్.
రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఉదయం 7 గంటలకు ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు... మహేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే డైలాగ్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. లక్షలాది మంది జనం బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్ పట్టుకున్న మహేశ్ షాడోపై ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కొటేషన్స్‌ని డిజైన్ చేశారు. అన్నట్లు ఇంతవరకు సినిమా రిలీజ్‌కు ముందు ఫస్ట్‌లుక్ మాత్రమే విడుదల చేసే సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ.. ఫస్ట్ ఆడియో అనే కొత్త ఫార్మాట్‌ను మహేశ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. జనవరి 26న మహేశ్ ప్రమాణ స్వీకారం వినాలనుకునే వారు హెడ్‌ఫోన్స్‌తో రెడీగా ఉండండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



