టీజర్ రివ్యూ: రంగస్థలం 1985
on Jan 24, 2018

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంభినేషన్‌లో వస్తోన్న మూవీ రంగస్థలం 1985. 80 నాటి పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది.. తన ప్రతి సినిమాకు స్టోరీ, టైటిల్ విషయంలో ఆధునికతకు పెద్దపీట వేసే సుకుమార్.. కెరీర్‌లో తొలిసారిగా రంగస్థలం 1985 అనే పాత సినిమా పేరు ఖరారు చేయడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. దానికి తోడు చరణ్, సమంతల లుక్ డిఫరెంట్‌గా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనిని మరింత పెంచుతూ చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.
గుబురు పొదల్లో వేటాడటానికి రెడీగా ఉన్న సింహం లాంటి చూపులతో రామ్‌చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. తన పేరు చిట్టిబాబని.. ఆ ఊరుకి తానే ఇంజనీర్‌ని అని.. తనకు మాట వినపడదు.. కానీ కనిపిస్తుందని చెప్పడం ద్వారా తన క్యారెక్టర్‌కి చెవుడు ఉందని చెర్రీ చెప్పేశాడు. చేతల ద్వారా.. మాటల ద్వారా వూళ్లో వాళ్లందరికీ చరణ్ తలలో నాలుక అని అర్థమవుతుంది. చివర్లో కొడవలి పట్టుకుని రౌద్రంగా వస్తోన్న చరణ్ లుక్ కథలో అంతర్లీనంగా పగ, ప్రతీకారాలు దాగి వున్నాయని చెప్పకనే చెబుతోంది.
డైలాగ్ డెలివరీ, నటన ద్వారా గత చిత్రాల కంటే చరణ్ యాక్టింగ్‌లో ఒక మెట్టు పైకెక్కినట్లు కనిపిస్తోంది. హీరోయిన్ సమంతని కాని.. మిగిలిన క్యారెక్టర్లు చేస్తున్న వారెవరిని ఇందులో చూపించలేదు.. రాక్‌స్టార్ డీఎస్‌పీ బ్యాక్‌గ్రౌండ్ అదిరిపోయింది. సుకుమార్ మార్క్ టేకింగ్ దీనిలో స్పష్టంగా కనిపించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో చరణ్ సరసన సమంత నటిస్తోండగా.. యాంకర్ అనసూయ కీలకపాత్రలో కనిపించనుంది. సమ్మర్ కానుకగా మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



