ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్.. ఇండస్ట్రీని ఏలుతావా!
on Jan 27, 2026

-భాగ్యశ్రీ బోర్సే పని అయిపోయినట్లేనా!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-లెనినే గట్టెక్కిస్తాడా!
-ఐరన్ లెగ్ అనే ముద్ర ఎందుకు
కవులు ప్రముఖ హీరోయిన్ 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse)ని చూస్తే చాలు అందమైన మగువ అంటే భాగ్యశ్రీ బోర్సే లాగా ఉండాలని వర్ణించడం స్టార్ట్ చేస్తారు. అంత అందం భాగ్యశ్రీ సొంతం. సిల్వర్ స్క్రీన్ పై తన పెర్ ఫార్మ్ కూడా అంతే అందంగా ఉంటుంది. అంతలా ఆమె పెర్ ఫార్మెన్స్ చేస్తుంటే చూస్తు ఉండిపోతాం. మిస్టర్ బచ్చన్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆయా చిత్రాల్లో తన పెర్ ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కళ్ళతోనే తన క్యారక్టర్ తీరు తెన్నులని ప్రేక్షకుల హృదయాల్లోకి చాలా భాగంగా తీసుకెళ్తుంది. ముఖ్యంగా కాంత లో పోషించిన కుమారి క్యారక్టర్ లో అయితే వంద సినిమాల్లో చేసిన అనుభవమున్న నటిగా, క్లిష్టమైన సన్నివేశాలని కూడా అలవోకగా చేసి మెప్పించింది.
కానీ ఇప్పటికి వరకు తను చేసిన చిత్రాలేవి పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకోగా కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా స్టార్టింగ్ లో పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాయి. కానీ ఆ తర్వాత రన్నింగ్ విషయంలో స్లో అయ్యాయి. విజయ్ దేవరకొండ తో చేసిన కింగ్ డమ్ కూడా అంతే. ఇండస్ట్రీలో అంతిమంగా హిట్ నే ప్రదానం. విమర్శకులు, బాక్స్ ఆఫీస్ దానికి మాత్రమే సలాం కొడతాయి.
దీంతో భాగశ్రీ బోర్సే కి కొంత మంది ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. తన పని అయిపోయినట్టేనా అనే డౌట్ ని కూడా సినీ సర్కిల్స్ లో తీసుకొస్తున్నారు. కానీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు గతంలో కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ గా ముద్రపడిన ఎంతో మంది హీరోయిన్లు ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని ఏలారు. తన రోల్ పరంగా భాగ్యశ్రీ మెస్మరైజ్ చేసే పెర్ ఫార్మ్ ఇస్తుంది. ఇతర లోపాల వల్ల మూవీ పెద్దగా ప్రేక్షకుల్లోకి రీచ్ అవ్వలేదు. ఒక్క హిట్ వస్తే భాగ్యశ్రీ టాప్ చైర్ ని కైవసం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Also read: అనసూయ కి గుడి కడతానంటున్న ప్రముఖ పూజారి.. ఓకే అంటుందా!
ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో అఖిల్(Akhil Akkineni)తో చేస్తున్న 'లెనిన్' మూవీ మాత్రమే ఉంది. మరి ఏ ఇతర చిత్రాలు ఆమె ఖాతాలో లేవు. ఈ నేపథ్యంలో లెనిన్(Lenin)హిట్ అయ్యి తనకి మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం లెనిన్ మూవీలో పెర్ ఫార్మెన్స్ పరంగా భాగ్య శ్రీ తన ముద్ర చాటడం ఖాయం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



