బాలయ్యతో 'జవాన్' విలన్.. ఇది కదా కావాల్సింది!
on Sep 19, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం 'భగవంత్ కేసరి' పూర్తిచేసే పనిలో ఉన్నారు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రానుంది. ఇందులో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్నాడు. తెలుగులో తనకిదే మొదటి సినిమా కావడం విశేషం.
ఇదిలా ఉంటే, 'భగవంత్ కేసరి' తరువాత బాలయ్య చేయనున్న సినిమాలోనూ పవర్ ఫుల్ విలన్ రోల్ ఉందట. ఆ వివరాల్లోకి వెళితే.. 'వాల్తేరు వీరయ్య' అనంతరం దర్శకుడు బాబీ మరో భారీ బడ్జెట్ మూవీ చేయనున్నారు. బాలకృష్ణ హీరోగా నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా 'జవాన్' విలన్ విజయ్ సేతుపతి కనిపించనున్నారని సమాచారం. త్వరలోనే బాలయ్య - బాబీ మూవీలో విజయ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, విజయ్ గతంలో 'ఉప్పెన' సినిమాలో బ్యాడీగా కనిపించాడు. అలాగే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్న సినిమాలోనూ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా దర్శనమిచ్చే అవకాశముందంటున్నారు.
Also Read