చంద్రబాబు అరెస్ట్‌పై డి.సురేష్‌బాబు సంచలన వ్యాఖ్యలు!
on Sep 19, 2023
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వివిధ నేరారోపణలపై ఇటీవల అరెస్ట్ అయిన విషయం, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై చాలామంది సినీ ప్రముఖులు స్పందించి వారి అభిప్రాయం చెప్పారు. అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీ ఈ విషయంలో స్పందించలేదని, ముఖ్యంగా నిర్మాత డి.సురేష్‌బాబు స్పందించలేదని పలువురు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ‘నాన్నగారు, నేను తెలుగుదేశం పార్టీకోసం పనిచేశాం. అది మా వ్యక్తిగత విషయం. అలాగే చంద్రబాబునాయుడుగారితోపాటు మిగతా ముఖ్యమంత్రులు కూడా చిత్ర పరిశ్రమకు ఎంతో సపోర్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ విషయంలో ఇండస్ట్రీ స్పందించలేదు. నిజానికి ఆంధ్రా, తెలంగాణ విభజన సమయంలో కూడా ఇండస్ట్రీ స్పందించలేదు. ఇప్పుడు కూడా స్పందించడం లేదు’ అన్నారు.
Also Read