Home

»

Latest News

నాన్న‌గారి కోసం టిఫిన్ తీసుకువ‌చ్చే రోజులు గుర్తుకువ‌స్తున్నాయి!

Jan 21, 2022

 

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు వ‌స్తుంటే త‌మ రామ‌కృష్ణ స్టూడియో జ్ఞాప‌కాలు గుర్తుకువ‌స్తున్నాయ‌నీ, స్టూడియోలో నాన్న‌గారి కోసం టిఫిన్ తీసుకువ‌చ్చేవాడిన‌నీ అప్ప‌టి రోజుల‌ను మ‌న‌నం చేసుకున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న న‌టించిన 'అఖండ' సినిమా విడుద‌లై గురువారంతో 50 రోజులు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ 35 ఎంఎం థియేట‌ర్‌లో అర్ధ శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నివాస్‌, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి, డిస్ట్రిబ్యూట‌ర్ శిరీష్‌, ఇత‌ర యూనిట్ స‌భ్యుల‌తో క‌లిసి పాల్గొన్నారు బాల‌య్య‌.

"ఇది ప్రేక్ష‌కులు ఇచ్చిన విజ‌యం. మా టీమ్ స‌మ‌ష్టి కృషి. శివ‌భ‌క్తునిగా 'అఖండ‌'లో నేను చేసిన పాత్రను నాన్న‌గారు చేసిన పాత్ర‌లు గుర్తుచేసుకుంటూ పోషించాను. మొన్న‌నే సంక్రాంతి పండుగ జ‌రుపుకున్నాం. ఇప్పుడు 'అఖండ' పండుగ జ‌రుపుకుంటున్నాం." అని ఆయ‌న అన్నారు. కొవిడ్ స‌మ‌యంలో థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారో, రారో అనుకున్న స‌మ‌యంలో తీర్థ‌యాత్ర‌ల‌కు వ‌చ్చిన‌ట్లు థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌చ్చార‌ని చెప్పారు. 

Also read: `బంగార్రాజు`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి..!

"ఇది ఆంధ్ర, తెలంగాణే కాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్ధ‌ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హ్యాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవ‌దేవుడే మమ్మల్ని కలిపాడు." అని ఉద్వేగంగా చెప్పారు.

Also read: 103 కేంద్రాలలో 'అఖండ' యాభై రోజుల జైత్ర‌యాత్ర‌!

మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారనీ, కానీ త‌మ‌కు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడని ఆయ‌న‌న్నారు. "నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈ 'అఖండ' విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైపోయిన సమాజానికి ప్రక్షాళ‌నగా ఈ సినిమా వుంది. ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయానికి కారకులు అభిమానులు, ప్రేక్షకులే. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది. రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు. తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండాలి." అని ఆకాంక్షించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com