Home

»

Latest News

`బంగార్రాజు`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి..!

Jan 20, 2022 2:05PM

2022 సంక్రాంతి కాస్త .. `బంగార్రాజు` నామ సంక్రాంతిగా నిలిచింది. తొలి ఆట నుంచే మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. వ‌సూళ్ళ ప‌రంగా మాత్రం ఈ విలేజ్ డ్రామా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది.

ఇదిలా ఉంటే.. `బంగార్రాజు`తో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌, క్యూట్ బ్యూటీ కృతి శెట్టి త‌మ విజ‌య‌ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తే.. కింగ్ నాగార్జున‌, వెర్స‌టైల్ యాక్ట్ర‌స్ ర‌మ్యకృష్ణ‌, ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేసిన‌ట్ల‌య్యింది. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఓం న‌మో వేంక‌టేశాయ‌`, `రాజు గారి గ‌ది 2`, `ఆఫీస‌ర్`, `దేవ‌దాస్`, `మ‌న్మ‌థుడు 2`, `వైల్డ్ డాగ్`.. ఇలా గ‌త కొంత‌కాలంగా స‌రైన విజ‌యం లేని నాగ్ కి `బంగార్రాజు`తో సాలిడ్ హిట్ ద‌క్కింది. అలాగే `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్` అనంత‌రం `బాల‌కృష్ణుడు`, `హ‌లో`, `శైల‌జా రెడ్డి అల్లుడు`, `రిప‌బ్లిక్`, `రొమాంటిక్`తో ట్రాక్ త‌ప్పిన ర‌మ్య‌కృష్ణ‌.. `బంగార్రాజు`తో చాన్నాళ్ళ త‌రువాత తెలుగునాట స‌క్సెస్ చూశారు.

 ఇక ప్రీవియ‌స్ మూవీ `నేల టిక్కెట్టు`తో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ‌.. `బంగార్రాజు`తో మ‌ళ్ళీ విజ‌య‌ప‌థంలోకి వ‌చ్చేశాడు. మొత్త‌మ్మీద‌.. నాగ్, ర‌మ్య‌, క‌ళ్యాణ్ కృష్ణ‌ని `బంగార్రాజు` రూపంలో ఎట్టకేల‌కు విజ‌యం వ‌రించిన‌ట్ల‌య్యింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com