డిక్టేటర్ సంక్రాంతికి డౌటే..!!
on Nov 2, 2015
బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డిక్టేటర్ సంక్రాంతికి డౌటే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని షూటింగ్ చేస్తున్నప్పటికీ ఆ సమయానికి సినిమా పూర్తవడం కష్టమే అంటున్నారు. టాకీ పార్ట్ ఇంకా 40 శాతం దాకా బ్యాలెన్స్ ఉందని.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయ్యేసరికి సంక్రాంతి డెడ్ లైన్ ను అందుకోవడం కష్టమని.. ఈ నేపథ్యంలో సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేసుకోవడం బెటరని ఆలోచిస్తున్నారట. మరోవైపు అసలే బాబాయికి అబ్బాయికి సంబంధాలు సరిగా లేవనే అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయని.. ఇక సంక్రాంతికి ఇద్దరూ పోటీ పడితే..ఫ్యామిలీకే చేటు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. కాబట్టి ‘డిక్టేటర్’ను వాయిదా వేయడం మంచిదని సలహాలు యూనిట్ సభ్యులకు ఇస్తున్నారట. మరి డిక్టేటర్ సంక్రాంతికి రేస్ నుంచి వెనక్కి తగ్గుతాడేమో చూడాలి.