BB3.. ఐటమ్ నంబర్
on Dec 22, 2020
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో బాలయ్య అఘోరాగా, ఐఏఎస్ ఆఫీసర్ గా రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. కథానుసారం బీబీ3లో ఓ ఐటమ్ నంబర్ కి స్థానముందని.. ఇందులో ఓ ప్రముఖ కథానాయికని నర్తింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే ఆ కథానాయిక ఎవరో క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతీ చిత్రంలోనూ ప్రత్యేక గీతాలు ఉన్నాయి. వాటిలో శ్రియ, కేథరిన్ ట్రెసా వంటి స్టార్ హీరోయిన్స్ చిందులేసిన సందర్భాలున్నాయి. మరి.. ఈ సారి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.
మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి తమన్ బాణీలు అందిస్తున్నాడు.
Also Read