'శివశంకరీ' విషయంలో బాలకృష్ణ నిజాయతీ!
on Jun 11, 2020
బాలకృష్ణ భోళాశంకరుడు అని అతడి మనసెరిగిన మనుషులు చెబుతుంటారు. మనసు లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడే అలవాటు నందమూరి నటసింహానికి లేదు. అంతా ఖుల్లామ్ ఖుల్లా. విషయం ఏదైనా, తన అభిప్రాయం ఏదైనా బాహాటంగా వ్యక్తం చేస్తారు. బాలయ్య మాటల్లో నిజాయతీ కనబడుతుంది. పుట్టినరోజు సందర్భంగా పాడిన 'శివ శంకరీ' పాట గురించీ ఆయన అంతే నిజాయతీగా స్పందించారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు కథానాయకుడిగా నటించిన 'జగదేకవీరుని కథ' సినిమాలో ఘంటశాల పాడిన 'శివ శంకరీ' సాంగ్ క్లాసిక్. ఇప్పటికీ ఆ పాటను పాడే సాహసం ఎవరూ చేయడం లేదు. బాలకృష్ణ చేశారు. ఘంటశాల స్థాయిలో పాడటం ఎవరికీ సాధ్యం కాదు. ఆయనతో బాలకృష్ణ గాత్రాన్ని పోల్చడం భావ్యం కాదు. కానీ, చాలామంది పోలుస్తున్నారు. బాలకృష్ణ పాడిన తీరుపై విమర్శలు చేస్తున్నారు. పాటకు అద్భుత స్పందన రాలేదు. అయితే, బాలకృష్ణ మాత్రం పాటపై హుందాగా స్పందించారు.
"ఛాలెంజింగ్ సాంగ్ నేను పాడలేనా? అనుకున్నాను. పాడాలని అనిపించింది. ఆ పాటను ఎవరూ అటెంప్ట్ చేయలేదు. నేనేదో బ్రహ్మాండంగా పాడాననీ, బాగా పాడాననీ చెప్పను. కానీ, ఒక ప్రయత్నం చేశాను. అటువంటి పాట పాడాలని ఉన్న ఒక ఇంట్రెస్ట్, పట్టుదల ఈ పాట పాడడానికి స్ఫూర్తి ఇచ్చాయి" అని బాలకృష్ణ అన్నారు. బ్రహ్మాండంగా పాడానని బాలకృష్ణ చెప్పడం లేదు. ఇకపై విమర్శకులు తమ మాటలు ఆపితే మంచిది.