జులై 10..బాహుబలి రిలీజ్ డేట్ ఫిక్స్
on Jun 14, 2015
బాహుబలికి ఉన్న హైపు, క్రేజు, దానిపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక హీరో అభిమానులో, లేదా తెలుగు సినిమా ప్రియులో ఎదురు చూస్తోన్న సినిమా కాదిది. మొత్తం ఇండియాలోని మూవీ లవర్స్ అంతా మన భారతీయ సినిమా స్థాయిని తెలియజెప్పే చిత్రమని నమ్ముతున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఇండియా మొత్తం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాని జులై 10 విడుదల చేస్తారా, లేదా? మరోసారి వాయిదా వేస్తారా? అనే అనుమానాల నేపథ్యంలో బాహుబలి రిలీజ్ డేట్ ప్రకటించారు. తిరుపతిలో జరిగిన బాహుబలి ఆడియో వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ ''బాహుబలి జులై 10న రాబోతోంది. ఇది ఫిక్స్'' అన్నారు. దాంతో బాహుబలి విడుదల తేదీపై ఉన్న అనుమానాలు పటాపంచలు అయిపోయాయి. తెలుగుతో పాటు హిందీలోనూ బాహుబలిని ఇదే రోజున విడుదల చేస్తారు.