నితిన్ పరువు తీసిన ఛార్మి
on Jun 15, 2015
నితిన్ - పూరి జగన్నాథ్ సినిమా ఆగిపోవడంతో ఇండ్రస్ట్రీ షాకయ్యింది. రెండ్రోజుల్లో సినిమా మొదలవుతుంది అనుకొంటే ఈలోగా క్యాన్సిల్ అయినట్టు అటు పూరి, ఇటు నితిన్ ఇద్దరూ ప్రకటించేశారు. ఈ ప్రాజెక్టులో ఛార్మి ఎంటర్ అవ్వడంతోనే సినిమా ఆగిపోయిందన్న గుసగుసలు వినిపించాయి. జ్యోతిలక్ష్మికి సహ నిర్మాతగా వ్యవహరించింది ఛార్మి. నితిన్ సినిమాకీ ఛార్మినే ప్రొడక్షన్ చూసుకొంటుందని పూరి సెలవిచ్చాడట. ప్రపోజల్ నచ్చక నితిన్ ఈ సినిమాకి నో చెప్పాడని చెప్పుకొన్నారు. అయితే ఈ వ్యవహారంపై ఛార్మి స్పందించింది.
ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు. నితిన్ సంస్థ శ్రేష్ట్ మీడియా దగ్గరే డబ్బుల్లేవ్ అని బయట చెబుతోందట ఛార్మి. ప్రస్తుతం శ్రేష్ట్ మీడియా అఖిల్‌తో ఓ సినిమా చేస్తోంది. దీనికి వినాయక్ దర్శకుడు. తమ సొమ్మంతా ఈసినిమాపైనే పెట్టుబడి పెట్టారని, అందుకే పూరి సినిమా చేయలేకపోతున్నారని ఛార్మి తన సన్నిహితుల దగ్గర చెబుతోందట. అయితే అందరూ నిజం తెలుసుకోకుండా తనని నిందిస్తున్నారని వాపోతోందట.
నితిన్ దగ్గర డబ్బులు లేవంటే ఇది నమ్మాలా..?? ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో భారీ లాభాలు సంపాదించాడు నితిన్. చిన్నదాన నీ కోసం ఫ్లాప్ అయినా... నితిన్ నష్టపోయిందేం లేదు. మరి ఛార్మి ఈ కామెంట్లు ఎందుకు చేసిందో, ఏంటో?