అట్లీ తెలుగు సినిమా
on Nov 20, 2023
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇన్ని రోజులు పాన్ ఇండియా హీరోలు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా దర్శకులు కూడా ఉంటున్నారు. షారుక్ హీరోగా వచ్చిన జవాన్ మూవీతో అట్లీ కూడా పాన్ ఇండియా దర్శకుడు హోదాని అనుభవిస్తున్నాడు. జవాన్ మూవీని అట్లీ తీర్చిదిద్దిన తీరుకి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ముందు ఆ మూవీ కాసుల వర్షాన్ని కురిపించింది. విడుదలైన అన్నిభాషల్లోను జవాన్ సంచలన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు అట్లీ ఒక కొత్త సంచలనానికి సిద్ధం అవుతున్నాడు.
దర్శకుడుగా ఎన్నో విభిన్న చిత్రాలని ప్రేక్షకులకి అందించిన అట్లీ ఇప్పుడు నిర్మాతగా మారనున్నాడు. పైగా తెలుగులో కూడా అట్లీ ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకి రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ తమిళంలో కూడా అట్లీ నిర్మాతగా సినిమాలు నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడు.
జవాన్ మూవీ తో అట్లీ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది. జవాన్ సినిమాని చూసిన హాలీవుడ్ ప్రముఖులు అట్లీకి దర్శకత్వం ఆఫర్ ని కూడా చేసారు. ఇలా దర్శకుడుగా సంచలనం సృష్టిస్తున్న అట్లీ నిర్మాతగాను ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Also Read