మూవీ విడుదలకి ఇంకా నాలుగు రోజులే.. ఆందోళనలో విక్రమ్ ఫ్యాన్స్
on Nov 20, 2023
15 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా లెవల్లో స్టార్ డంని సంపాదించిన నటుడు విక్రమ్. అభిమానులందరూ చియాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. తన అభిమానులని సంతోషపరచడానికి సినిమాలో తాను పోషించే క్యారక్టర్ కోసం విక్రమ్ ఎంతగానో కష్టపడతాడు. విక్రమ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఆనందంతో గంతులేస్తారు. అలాంటిది మరికొన్ని రోజుల్లో రాబోతున్న విక్రమ్ కొత్త మూవీ విషయంలో అభిమానులు చాలా టెన్షన్ గా ఉన్నారు.
విక్రమ్ నుండి వస్తున్న తాజా చిత్రం ధ్రువ నక్షత్రం. క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈ నెల 24 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుంది. అంటే ఇంక కేవలం నాలుగు రోజుల్లోనే ధ్రువనక్షత్రం సినిమా అన్ని భాషలతో పాటే తెలుగులోను విడుదల అవుతుంది. కానీ ఎక్కడ కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మాత్త్రం జరగటంలేదు. ఆఫ్ లైన్ లో దర్శకుడు గౌతమ్ యాక్టివ్ గా ప్రమోట్ చేస్తున్నప్పటికీ విక్రమ్ గాని సినిమాలో నటిస్తున్న హీరోయిన్ గాని ఇతర ఆర్టిస్ట్ లు గాని ధ్రువనక్షత్రం సినిమా గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. పైగా ధ్రువ నక్షత్రం మీద ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ లేకపోవడం కూడా చియాన్ ఫ్యాన్స్ లో ఆందోళన కలగచేస్తుంది
విక్రమ్ సరసన రీతువర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ ఎప్పుడో స్టార్ట్ చేసాడు. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. సీనియర్ హీరో పార్తీబన్,
సిమ్రాన్, జైలర్ విలన్ వినాయకన్ తదితరులు నటించిన ఈ భారీ చిత్రానికి ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తుండగా గౌతమ్ వాసుదేవ్ మీననే నిర్మాతగాను
వ్యవహరిస్తున్నాడు. చియాన్ ఇక నుంచైనా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.