ENGLISH | TELUGU  

'సర్కస్ కార్-2'కి ప్రత్యేక ఆకర్షణగా అషు రెడ్డి గ్లామర్!

on Nov 29, 2021

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్య తారాగణంగా రూపొందుతోన్న సినిమా 'సర్కస్ కార్-2'. ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వి.కె నిరిస్తున్న ఈ సినిమాకి నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

'సర్కస్ కార్-2' ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. "ఒక రోజు తెల్లారేసరికి ఆ ఊరి పొలిమేరల్లో ఓ కారు కనిపిస్తుంది. ఎన్ని రోజులు గడిచినా ఆ కారు సొంతదారు ఎవరో తెలియదు. ఆ ఊరివారిని సదరు కారు ముప్పుతిప్పలు పెడుతుంటుంది. ఆ కారును ఆశ్రయించి ఉన్న అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? ఎన్ని పాట్లు పడ్డారు? వంటి ఆసక్తికర కథ-కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది" అని మూవీ టీమ్ తెలిపింది.

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు మాట్లాడుతూ.. "సర్కస్ కార్ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్.. ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు.. వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే 'సర్కస్ కార్-2' మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది. పిల్లల నటన, అషు రెడ్డి గ్లామర్ 'సర్కస్ కార్-2'కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి" అన్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.