Arthamainda Arun Kumar 2 Review: అర్థమైందా అరుణ్ కుమార్-2 రివ్యూ!
on Nov 3, 2024
వెబ్ సిరీస్: అర్థమైందా అరుణ్ కుమార్-2
నటీనటులు: పవన్ సిద్దు, తేజస్వి మదివాడ, సిరి రాశి, అనన్య శర్మ
ఎడిటింగ్: అనిల్ కుమార్
మ్యూజిక్: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్
నిర్మాతలు: సాయి కుమార్, నమిత్ శర్మ
దర్శకత్వం: ఆదిత్య కెవి
ఓటీటీ : ఆహా
కథ:
అరుణ్ కుమార్ (పవన్ సిద్ధూ) గతంలో తను ఇంటర్న్ చేసిన ఆఫీసులోనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో అడుగుపెడతాడు. తన దగ్గర అసిస్టెంట్ గా చేసిన అతను ఆ స్థాయికి చేరుకోవడం షాలిని (తేజస్వి)కి నచ్చదు. అతను ఆ సీట్లో కూర్చోవడానికి అర్హత లేని వాడని నిరూపించాలని చూస్తుంటుంది. ఆమె బారి నుంచి తప్పించుకోవడానికి అరుణ్ ట్రై చేస్తాడు. ఇదిలా ఉండగా ఓ రోజున ఆఫీసులోకి అందమైన అమ్మాయి అడుగుపెడుతుంది. ఆమె పేరు సోనియా (సిరి రాశి) అనీ, తమ సంస్థకి అత్యంత ముఖ్యుడైన 'రాబర్ట్'కి కూతురని అరుణ్ కుమార్ తో కార్తీక్ చెబుతాడు. రాబర్ట్ తన సంస్థని కూతురికి అప్పగించడానికి ముందు ట్రైనింగ్ కోసం ఆమెను అక్కడికి పంపంచినట్టు చెబుతాడు. ఆమెకి పని నేర్పించమని అంటాడు. అయితే విదేశాల్లో చదువుకుని వచ్చిన సోనియాకి తెలుగు సరిగ్గా రాకపోవడంతో అరుణ్ కుమార్ కి కష్టమవుతుంది. ఈ సమయంలోనే తన ఆఫీసులో ప్రత్యక్షమైన పల్లవి (అనన్య శర్మ)ను చూసి అరుణ్ కుమార్ షాక్ అవుతాడు. తనకి సారీ చెప్పిన వినదు. ఒక వైపున వర్క్ టెన్షన్ , మరోవైపున షాలినీ వ్యూహాలు, పల్లవి కోపం .. ఇంకో వైపున సోనియా టార్చర్ అరుణ్ కుమార్ ను ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెడతాయి. అప్పుడు అరుణ్ ఏం చేస్తాడనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఆఫీస్ లో అరుణ్ కుమార్ కష్టాలు ఫస్ట్ సీజన్ లో ఉన్నంత కామెడీగా ఇందులో ఉండవు.. కంటెంట్ కి తగిన కామెడీ ఉండదు. అందుకు తగిన సన్నివేశాలను డిజైన్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా అయిదు ఎపిసోడ్ లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 25-35 నిమిషాల వరకు ఉంటుంది.
వాటిల్లో నాల్గో ఎపిసోడ్ చాలా స్లోగా సాగుతుంది. మొదటి సీజన్ లో అమాయకంగా పల్లెటూరి నుండి వచ్చి కార్పోరేట్ కల్చర్ కి అలవాటు పడటం అదంతా కాస్త ఎమోషనల్ అండ్ కామెడీతో పాటు ఎంగేజింగ్ గా సాగుతుంది . కానీ ఇందులో అది మిస్ అయ్యింది. కారణం క్యారెక్టర్ ని మార్చేశారు.మొదటి సీజన్ లో అరుణ్ కుమార్ పాత్ర చేసిన అతని స్థానంలో కొత్త కుర్రాడి(సిద్దు పవన్)ని తీసుకోవడంతో అతనితో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోతారు. అతనికి ఆఫీస్ లైఫ్ స్టైల్ అంతా తెలిసిన అలా కృత్రిమంగా నటిస్తున్నాడనే భావన ఆడియన్స్ కలుగుతుంది.
పర్లేదనిపించేలా కొన్ని సీన్లు ఉండగా మరికొన్ని ఎందుకున్నాయిరా బాబు అనేంతలా ఉంటాయి. ముఖ్యంగా సీజన్-2లో కథ పెద్దగా కదల్లేదు. చాలా స్లోగా సాగుతుంది. కథా పాయింట్ ముందుకు సాగకపోగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. సీజన్-1 లో ఏయే అంశాలు బలంగా మారాయనేది చూసుకుంటే .. సీజన్-2లో అవి మిస్సవ్వకుండా చూసుకుంటే బాగుండేది. చివరి వరకు ఎంగేజింగ్ చేయలేకపోయాడు దర్శకుడు. నిర్మాణ విలవలు బాగున్నాయి. అనిల్ కుమార్ ఎడిటింగ్ ఓకే. అజయ్ అరసాడ మ్యూజిక్ పర్వాలేదు. రెహన్ షేక్ సినిమాటోగ్రఫీ బాగుంది.
నటీనటుల పనితీరు:
అరుణ్ కుమార్ గా పవన్ సిద్దు ఒదిగిపోయాడు. సోనియాగా సిరి రాశి, షాలినిగా తేజస్వి, పల్లవిగా అనన్య శర్మ ఆకట్టుకున్నారు. మిగతావారంతా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా..
ఇది యావరేజ్ వన్ టైమ్ వాచెబుల్ సిరీస్.
రేటింగ్: 2.25 /5
✍️. దాసరి మల్లేశ్
Also Read