బాలీవుడ్ పై డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్!
on Nov 3, 2024
నటుడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ పై విమర్శలు చేసి, మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణాదిలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అన్ని చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయన్న ఆయన, బాలీవుడ్ లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. ఉత్తరాది ప్రాంతీయ భాషలైన మరాఠీ, భోజ్‌పురి, బిహారీ, హర్యానా, గుజరాజ్ సినిమాలకు తొక్కేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత సినీ పరిశ్రమలే లేవని అన్నారు. బాలీవుడ్ పై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read