ఆర్నాల్డ్ కామెడీ చేస్తానంటున్నాడు..!
on May 5, 2016
కండలు తిరిగిన గండరగండడు ఆర్నాల్ ష్వార్జ్ నెగ్గర్. ఒక టైంలో ప్రపంచంలో ఏ మూలైనా బాడీ బిల్డర్ అన్న పేరు వినబడితే పక్కనే ఆర్నాల్డ్ పేరు కూడా ఉండేది. మిస్టర్ యూనివర్స్ గా గెలుపొంది, ఆ తర్వాత సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు ఆర్నాల్డ్. ప్రెడేటర్, టెర్మినేటర్, ది ఎక్స్ పాండబుల్స్ లాంటి సినిమాల ద్వారా సినీ కెరీర్ ను మరింత స్ట్రాంగ్ గా ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం వయసైపోయిన ఆర్దాల్డ్ యాక్షన్ సీక్వెన్స్ లను కాస్త దూరం పెడుతున్నాడు. మంచి కామెడీ సినిమాలు తీయడంపైనే ఆయన దృష్టంతా ఉందట. దర్శకుడు టరన్ కిల్లమ్ అనే కొత్త దర్శకుడితో వై వి ఆర్ కిల్లింగ్ గంథెర్ అనే కామెడీ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. టైటిల్ రోల్ గంథర్ పాత్రలో ఆర్నాల్డ్ నటిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కిల్లర్, దొంగ అయిన గంథర్ పాత్రకు బలుపు చాలా ఎక్కువగా ఉంటుంది. అతనితో విసిగిపోయిన అండర్ వరల్డ్ కిల్లర్స్, చంపడానికి ప్లాన్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకుంటూ, గంథర్ వాళ్లతో ఎలా ఆడుకున్నాడు అనేది సినిమా కథ. గతంలో కూడా కొన్ని కామెడీ సినిమాల్లో ఆర్నాల్డ్ నటించినా, వయసైన తర్వాత చేస్తున్న మొదటి కామెడీ జానర్ ఇదే. ఇప్పటికే ది లెజండ్ ఆఫ్ కొనాన్ అనే యాక్షన్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. కొనాన్ ది బార్బేరియన్ సినిమా, ఈ బాడీ బిల్డర్ కెరీర్ కు మంచి పుష్ ఇచ్చింది. దానికి సీక్వెల్ గానే ఈ లెజండ్ ఆప్ కొనాన్ అనే సినిమా ఉండబోతోంది.