‘సైరా’ నుంచి తప్పుకున్నాడా! ఎవరు చెప్పారు?
on Sep 14, 2017

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నుంచి... ఏ ఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడట. ‘సైరా’ టీజర్ మ్యూజిక్ విషయంలో కూడా రెహ్మాన్ కు తీరిక లేకపోవడంతో.. తమన్ తో చేయించింది కూడా అందుకే నట. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త. అసలు వీళ్లకు ఇవన్నీ ఎవరన్నా చెబుతారా? లేక ఏవడికి తోచింది వాడు అనేసుకోని... రాసేసుకుంటారా? ఎవరికీ అర్థం కాని విషయం ఇది. పైగా... కచ్చితంగా నమ్మే రీతిలో రాస్తారు. రెహ్మాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. దాని వల్ల తీరిక లేక ‘సైరా’ను వదులుకున్నాడట. ఇది వింటే ఎవరైనా నిజమే అనుకుంటారు కదా. నిజానికి ‘సైరా’ నుంచి రెహ్మాన్ తప్పుకోలేదు. ఈ సినిమాకు ఆయనే సంగీత దర్శకుడు. ఇప్పటికే ‘సైరా’ సంగీత చర్చలు మొదలయ్యాయ్ కూడా. రామ్ చరణ్ 200 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రతి సాంకేతిక నిపుణుడ్నీ.. ఆయా రంగాల్లో అత్యుత్తమ స్థాయిలో ఉన్న వారినే ఏరి కోరి ఎంపిక చేశారు దర్శక, నిర్మాతలు. రెహ్మాన్ ని తీసుకోవడంలో ఆంతర్యం కూడా అదే. రెహ్మాన్ కూడా ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాకు పని చేస్తున్నారు. త్వరలో ‘సైరా’ సెట్స్ కి వెళ్ల నుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



