మెగాస్టార్‌తో సూపర్ హీరోయిన్.. ఈ సారీ అంతేనా?
on May 16, 2021
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'స్టాలిన్' (2006)లో ప్రత్యేక గీతంలో మెరిశారు సూపర్ హీరోయిన్ అనుష్కా శెట్టి. అలాగే.. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా.. నరసింహారెడ్డి'లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిగా అతిథి పాత్రలో అలరించారామె. కట్ చేస్తే.. ముచ్చటగా మూడోసారి మెగాస్టార్ మూవీలో సందడి చేయనున్నారట స్వీటీ.
ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'లూసీఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా రూపొందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రంలో చిరుకి జోడీగా అనుష్కని ఎంపిక చేసే దిశగా రాజా ప్రయత్నాలు చేస్తున్నారని.. స్వీటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనని అంటున్నారు.
వాస్తవానికి ఇదే పాత్ర కోసం గతంలో నయనతార, త్రిష వంటి అగ్ర కథానాయికల పేర్లు వినిపించాయి. కట్ చేస్తే.. ఇప్పుడా పాత్ర అనుష్కని వరించిందని అంటున్నారు. పాత్ర నిడివితో సంబంధం లేకుండా సినిమాలు చేయడం స్వీటీ శైలి. అందుకే.. ఈ రోల్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట మిస్ శెట్టి.
మొత్తమ్మీద.. చిరంజీవి సినిమాలో అనుష్క నటిస్తోందంటే అతిథి తరహా వేషాలేనని ఫిక్స్ అయిపోవాల్సివస్తోందన్నమాట.
Also Read