అంతరిక్షం తాకుతోన్న తెలుగు సినిమా!!
on Dec 10, 2018
తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయి నుంచి అంతరిక్షాన్ని అంటుతోంది. అవును ఇటీవల విడుదలైన `అంతరిక్షం` ట్రైలర్ చూస్తే ఈ మాట అనక మానరు. స్పేస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే హాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది కానీ, ఆ తరహా ట్రెండ్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో కూడా వస్తోంది. దక్షిణాది దర్శకులుగా కూడా న్యూ కాన్సెప్ట్స్ పై దృష్టి సారిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ తరహాలో వస్తోన్న తెలుగు సినిమా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన `అంతరిక్షం 9000కేఎమ్పియచ్`. ఈ చిత్రంట్రైలర్ ఆదివారం విడదులైంది. ట్రైలర్ చూసిన వారంతా ఇది తెలుగు సినిమా ట్రైలర్ నా లేకుంటే హాలీవుడ్ సినిమా ట్రైలర్ నా అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో స్పేస్ నేపథ్యంలో వస్తోన్న తొలి సినిమా ఇదే. తమిళంలో స్పేస్ నేపథ్యంలో `టిక్ టిక్ టిక్` సినిమా వచ్చిన్పటికీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ అంతరిక్షం సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఘాజీ లాంటి తొలి సినిమాతోనే డైరక్టర్ గా విమర్శకుల ప్రశంసలందుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంతో పాటు క్రిష్, తన మిత్రులు కలిసి ఈ చి త్రాన్ని నిర్మిస్తుండటంతో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. లావణ్య త్రిపాటి, అదితి రావ్ హైదరి ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను తీసుకున్నారు. అందుకే స్పేస్ నేపథ్యంలో వచ్చే విజువల్స్ హై స్టాడర్డ్స్ లో ఉన్నాయి. రెండున్నర నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా అంతరిక్షాన్ని అంటుకోవడం ఖాయం అంటున్నారు తెలుగు సినిమా పండితులు. ఈ చిత్రానికి విజువల్స్ ఎఫెక్ట్స్ హైలెట్స్ గా నిలవనున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం విశేషం. ట్రైలర్ లో జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ విహారి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిసెంబర్ 21న అంతరిక్షం చిత్రం విడుదల కానుంది.