బ్రాహ్మణ అమ్మాయిగా పుట్టిన నయన తార అలా చేసి ఇరగదీసింది..
on Oct 25, 2023
సౌత్ ఇండియా అగ్ర కధానాయిక నయన తార నుంచి తాజాగా ఒక కొత్త మూవీ రాబోతుంది. ఆ మూవీ పేరు అన్నపూర్ణి. తాజాగా ఆ సినిమా నుంచి చిత్ర బృందం చిన్నపాటి టీజర్ ని రిలీజ్ చేసింది. ఒక్క టీజర్ తో నయన్ పెను సంచలనమే సృష్టించింది. మరి ఫ్యూచర్ లో తన అన్నపూర్ణి సినిమా ద్వారా నయనతార ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో..
అన్నపూర్ణి సినిమాలో సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా టైటిల్ రోల్ లో నయన తార నటిస్తుంది. రిలీజ్ అయిన టీజర్ లో అన్నపూర్ణి తల్లి తండ్రులు వాళ్ళ ఆచారం ప్రకారం చాలా నిష్టగా దేవుడ్ని ధ్యానిస్తున్నారు. అన్నపూర్ణి (నయన తార ) సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి ఒక బుక్ లో నాన్-వెజ్ వంటకాల్ని ఎంతో ఆశగా చూస్తు ఉంది. ఆ తర్వాత తల్లి హారతి తీసుకురావడంతో అన్నపూర్ణి పుస్తకం మూసేస్తుంది.
అన్నపూర్ణి టీజర్ అయితే అదిరిపోయింది. టీజర్ చూసిన వాళ్ళు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనుకోవడం ఖాయం. అలాగే ఈ సినిమా తో మరిన్ని కొత్త కాన్సెప్టులతో కథలు రావటం కూడా ఖాయం ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీ లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నయనతారే. కాబట్టి అన్నపూర్ణి సినిమా సౌత్ మొత్తం రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయం. అన్నపూర్ణి టీజర్ లో నయన తార కి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుని మేకర్స్ ప్రకటించారు. నయన తార 75 వ సినిమా గా అన్నపూర్ణి రాబోతుంది.