ఆ హీరోతో పెళ్ళికి రెడీ అయిన ఐశర్య!
on Oct 25, 2023
ఒకప్పుడు స్టార్ హీరోల కుమారులు మాత్రమే హీరోలుగా ఎంట్రీ ఇచ్చేవారు, కొందరు సక్సెస్ అయితే మరికొందరు మరుగున పడిపోయేవారు. కానీ, ఇప్పుడు హీరోల కుమార్తెలు కూడా ఎంట్రీ ఇస్తూ మంచి విజయాలు అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ సౌత్‌లో తక్కువే అని చెప్పాలి. యాక్షన్ కింగ్ అర్జున్ కర్ణాటకకు చెందినవాడైనప్పటికీ తెలుగు, తమిళ్ సినిమాల్లోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. కన్నడలో కూడా చాలా సినిమాల్లో నటించాడు. ఇప్పుడు అతని నట వారసత్వాన్ని కుమార్తె ఐశర్య తీసుకొని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో సరైన హిట్ లేదు. తన కూతుర్ని హీరోయిన్ నిలబెట్టాలన్న ఉద్దేశంతో కన్నడ హీరో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ను హీరోగా పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య హీరోయిన్. ఈ సినిమా అయినా ఆమెకు హీరోయిన్‌గా మంచి పేరు తెస్తుందని అర్జున్ ఆశిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశర్య ప్రేమలో పడిరది. చాలా కాలంగా వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం కూడా తెలిపాయి. తంబి రామయ్య సీనియర్ నటుడు. ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రలు పోషించాడు. అలాగే ఉమాపతి కూడా పలు తమిళ్ చిత్రాల్లో హీరోగా నటించాడు. త్వరలోనే ఐశ్వర్య, ఉమాపతిల నిశ్చితార్థం జరుగుతుందని తెలుస్తోంది.
Also Read