
'బిజిఎం'తో సినిమా హిట్ రేంజ్ పెంచవచ్చని నిరూపించిన అతి తక్కువ మంది సంగీత దర్శకుల్లో అనిరుద్ ఒకరు. పై మాట ఏమైనా అక్షర దోషం ఉందా అని అనడం ఆలస్యం, ఎలాంటి అక్షర దోషం లేదు. సూపర్ హిట్ కూడా చేసాడని అభిమానులు పలు ఉదాహరణలు చెప్తారు. ఇప్పుడు ఈ మ్యూజిక్ సంచలనం రామ్ చరణ్ , సుకుమార్(RC17 ) ల మూవీకి ఫైనల్ అయ్యాడు.
దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆర్ సి 17 కధా నేపథ్యం రెగ్యులర్ ఫార్మేట్ కి భిన్నంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. అంటే డిఫరెంట్ జోనర్. ఈ నేపథ్యంలో అనిరుద్ మ్యూజిక్ పై క్యూరియాసిటీ నెలకొని ఉంది. అనిరుద్ ట్రాక్ రికార్డు దృష్ట్యా ఆర్ సి 17 కి అదనపు బలంగా నిలుస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్య నుంచి మొన్నటి పుష్ప 2 వరకు సుకుమార్ అన్ని సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బట్ ఇప్పుడు అనిరుద్ చేరాడు.
ఇది కూడా చదవండి: తమన్నా తరహాలోనే ఆభరణాల వ్యాపారంలో టాప్ 5 సౌత్ స్టార్స్!

మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా పూజా కార్యక్రమాలు రేపు నవంబర్ 1వ తేదీన వైభవంగా ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2027 జనవరి నుంచి జరగవచ్చని టాక్.
[Anirudh In Rc17 Fix, Ram Charan, Sukumar, RC17, Ram Charan RC17 movie, Mythri Movie Makers, Tollywood news,Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]





