
ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలి.. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలనే సామెతని సినీ రంగంలో కొంత మంది భామలు తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా మిల్క్ బ్యూటీ తమన్నా ఇండోర్‌లోని `ది మ్యారియట్`లో తన సొంత జ్యువెలరీ బ్రాండ్ `తమన్నా ఫైన్ జ్యువెలరీ` ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. తమన్నా అలా నవ్వులు చిందిస్తూ తన డిజైన్లని ప్రదర్శించడంతో అభిమానులు, ఫ్యాషన్ ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ మేరకు తమన్నా పిక్స్ వైరల్ గా మారాయి.
తమన్నా తరహాలోనే ఆభరణాల వ్యాపారంలో,ఫ్యాషన్ రంగంలో బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తున్న సౌత్ స్టార్లలో మొదటి స్థానంలో నిలుస్తారు సమంత. పర్యావరణహిత లాబ్-గ్రోన్ డైమండ్స్ బ్రాండ్ అయిన 'మోవిసాని' (Movisani) సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా, ఆ బ్రాండ్‌కు ప్రధాన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ అభిమానులని, యువతనిఆకట్టుకుంటూ వస్తుంది. దీనితో పాటు 'సాకీ' (Saaki) అనే ఫ్యాషన్ అపారెల్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతూ ట్రెండీ డిజైన్లతో ఈ కామర్స్ మార్కెట్‌లో సత్తా చాటుతుంది.
ఇక ఈ బిజినెస్ రేసులో రెండో స్థానంలో నిలిచిన చందమామ కాజల్ అగర్వాల్ తన సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి సంయుక్తంగా 'మార్సాలా జ్యువెలరీ' అనే ఫైన్ జ్యువెలరీ లైన్‌ని ప్రారంభించి విజయవంతంగా రన్ చేస్తూ వస్తుంది. చేతితో అత్యంత నైపుణ్యంగా తయారుచేసిన వెండి, బంగారు ఆభరణాలని విక్రయించే ఈ బ్రాండ్ ఫ్యాషన్ లవర్స్ ఫేవరేట్. మూడో స్థానంలో ఆభరణాల డిజైనింగ్ రంగంలో శ్రియా సందడి చేస్తుంది. ఫ్యాషన్ జైనింగ్‌పై ఉన్న ప్రత్యేక ఆసక్తితో శ్రియాస్ కలెక్షన్`తో పలు హ్యాండ్‌క్రాఫ్టెడ్ ఆర్టిసానల్ జ్యువెలరీ ప్రమోషన్లలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ఇది కూడా చదవండి: సినిమా ఆశ చూపి హత్యలు: రియల్ స్టోరీతో తెరకెక్కిన మూవీ..ఏ ఓటిటిలో చూడొచ్చంటే!

నాలుగో స్థానంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం ఆభరణాల రంగంలో బిజినెస్ పార్ట్‌నర్లుగా దూసుకుపోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతిమణి నమ్రతా శిరోద్కర్ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ `AMB జ్యువెల్ క్రాఫ్ట్` సుప్రసిద్ధ వ్యాపారవేత్తలతో కలిసి ప్రారంభించడంలో కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. తమిళ చిత్రసీమలో నటుడిగా మెప్పిస్తూనే ఆభరణాల వ్యాపారంలో భారీగా ఆర్జించిన అగ్రనటుల్లో ప్రశాంత్ అగ్రస్థానంలో నిలుస్తారు. 90ల నాటి `జీన్స్` సినిమా ఫేమ్ ప్రశాంత్.. చెన్నైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన పనగల్ పార్క్ లో మల్టీ స్టోరీ జ్యువెలరీ షాపింగ్ కాంప్లెక్స్‌స్థాపించి వ్యాపార రంగంలో భారీ విజయం సాధించారు.
[South Indian Actresses Jewellery Business Brands, South Actresses Jewellery Business, south indian actresses jewellery business, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]





