రవితేజను కరెక్ట్‌గా వాడుకుంటే సినిమా బ్లాస్టే!
on Jan 7, 2021

రవితేజను ఎవరైతే కరెక్టుగా వాడుకుంటారో ఆ సినిమా బ్లాస్ట్ అవుతుందని అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన సినిమా 'క్రాక్'. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలవుతోంది. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్‌గా పాల్గొని మాట్లాడాడు. "తొమ్మిది నెలలుగా ఇంట్లోనే ఉన్నాం. ఈ ఫంక్షన్ చూస్తుంటే ఒక కిక్ వచ్చినట్టు అనిపిస్తోంది. గత ఏడాది సంక్రాంతికి కాసుల వర్షం కురిసింది. ఈ సంక్రాంతికి 'క్రాక్'తో అదే రేంజ్ లో థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియెన్స్ రెవిన్యూ ఇచ్చి ముందు రాబోయే సినిమాలకి ధైర్యాన్ని ఇవ్వాలి" అని ఆయన పిలుపిచ్చాడు.
రవితేజ గురించి మాట్లాడుతూ "రవి అంటే సన్. సన్ అంటే ఫైర్. వెలుగుతూనే ఉంటాడు. దర్శకులు ఆ ఫైర్‌ని ఎంత వాడుకోవాలో అంత వాడుకోవచ్చు. ఎవరైతే ఆయన్ని కరెక్ట్ గా వాడుకుంటారో ఆ సినిమా బ్లాస్ట్ అవుతుంది." అని చెప్పాడు అనిల్. సముద్రకని మంచి దర్శకుడనీ, నటుడిగా పలు వెరీయేషన్స్ ఉన్న పాత్రలని చూజ్ చేసుకుంటున్నారనీ అన్నాడు. "ఈ సినిమా డెఫినెట్ గా షూర్ షాట్ హిట్.. గోపి హ్యాపీగా తడి గుడ్డేసుకొని పడుకోవచ్చు." అని ధీమాగా చెప్పాడు.
ఇదివరకు రవితేజతో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'రాజా ది గ్రేట్' సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత రవితేజకు ఇంతదాకా మరో హిట్ రాలేదు. 'క్రాక్'తో ఆ హిట్ వస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



