డొక్కు స్కూటర్ ఖరీదు కోట్ల రూపాయలట..!
on May 26, 2016
అది ఒక డొక్కు స్కూటర్. పాత సామాన్లవాళ్లు కూడా కొనాలంటే ఎదురు డబ్బలడిగే రకం బండి అది. అలాంటి బండి విలువ ఇప్పుడు కోట్ల రూపాయలు పెరిగింది. ఇంతకూ అంత వాల్యూ ఎందుకు..దానిలో ఏదైనా విశేషముందా అని అడిగితే ఉందనే చెప్పాలి. ఆ విశేషమేంటో తెలుసుకునే ముందు, అన్ని కోట్ల రూపాయలకు కూడా దాని ఓనర్ ఆ స్కూటర్ ను అమ్మడం లేదు. ఇదింకా విచిత్రం కదా..విషయంలోకి వెళ్తే, అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, విద్యాబాలన్ కీలక పాత్రలు పోషించిన సినిమా టీన్. ఈ సినిమాలో అమితాబ్ ఒక మధ్య తరగతి పెద్దాయనలా కనిపిస్తాడు. అందుకోసం సినిమా దర్శకుడు కోల్ కతా లోని సెకండ్ హ్యాండ్ వ్యాపారి సుజిత్ నారాయణ్ అనే అతని దగ్గర ఒక పాత డొక్కు స్కూటర్ ను తెచ్చి షూటింగ్ లో వాడాడు. షూటింగ్ అయిపోయాక ఆ స్కూటర్ ను తిరిగిచ్చేశారు. అయితే అమితాబ్ వాడిన స్కూటర్ కాబట్టి, ఇప్పుడు దానికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది ఆ స్కూటర్ ను తమకు అమ్మాలని, కావాలంటే ఎన్ని కోట్లయినా ఇస్తామని సుజిత్ ను కలుస్తున్నారట. అయితే అమితాబ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన సుజిత్ మాత్రం, ఇంత విలువైన స్కూటర్ ను ఎవరికీ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడట. అమితాబ్ మీద అతనికున్న అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.