వివాదంలో అజయ్ దేవగణ్ శివాయ్..!
on May 26, 2016
బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న సినిమా శివాయ్. చూడటానికి సోషియో ఫాంటసీలా అనిపిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్ గా రిలీజైంది. అయితే ఈ పోస్టర్ తో అజయ్ వివాదంలో చిక్కుకున్నారు. మూవీ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో శివుడి ఆకారంలో పర్వతం కనిపిస్తుండగా, అజయ్ దాన్నుంచి వేలాడుతున్నట్టుగా డిజైన్ చేశారు. కాళ్లకు బూట్లు వేసుకుని శివుడి ఆకారం మీద నిల్చోవడం కరెక్ట్ కాదని హిందూత్వ వాదులంటున్నారు. శివాయ్ సినిమాను అజయ్ దేవగణ్ తనే నిర్మిస్తూ, దర్శకత్వం చేస్తున్నాడు. అతని సొంత బ్యానర్ అయిన అజయ్ దేవగణ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దీపావళికి శివాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.