తిక్కను తొక్కేస్తున్న అల్లు అరవింద్
on Aug 12, 2016
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం తిక్క. ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ ఈసినిమాకి బాబు బంగారం ద్వారా గట్టి పోటీ ఏర్పడింది. మరోవైపు... మరో మెగా సినిమా తిక్కకు అడ్డు పడుతోంది... పోటీగా నిలుస్తోంది. ఇది టాలీవుడ్‌నీ, మెగా ఫ్యాన్స్‌నీ కలరవపెట్టే విషయమే. వివరాల్లోకి వెళ్తే.. తిక్క చిత్రానికి ఆంధ్ర, తెలంగాణల్లో సరైన థియేటర్లు దొరకడం లేదు. దానికి కారణం... శ్రీరస్తు శుభమస్తు. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం వచ్చి వారం రోజులయ్యింది. రేపు.. తిక్క కోసం శ్రీరస్తు శుభమస్తు సినిమాని తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అల్లు అరవింద్ మాత్రం థియేటర్లు ఇవ్వడం లేదని టాక్. తన సొంత కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అన్నట్టు... థియేటర్లని తన చేతుల్లోనే ఉంచుకొన్నాడట. దిల్‌రాజు చేతిలో ఉన్న థియేటర్లను కూడా మేనిప్లే చేస్తున్నట్టు టాక్ వస్తోంది. సో.. ఇదంతా తిక్కపై భారీ ఎత్తున ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈ విషయమే తేజూ.. అరవింద్‌తో మాట్లాడాలని ప్రయత్నించాడని కానీ.. అరవింద్ సరిగా స్పందించడం లేదని తెలుస్తోంది.