బాహుబలిని బన్నీ ఏమన్నాడంటే..
on Jul 8, 2015
అందరి నోటా బాహుబలి మాటే. బాహుబలి తెలుగు సినిమా గర్వం... అంటూ అందరూ రాజమౌళి అండ్ టీమ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే మాట చెబుతున్నాడు. బాహుబలికి విషెష్ చెబుతూ బన్నీ సోషల్ మీడియాలో స్పందించాడు. బాహుబలిలాంటి సినిమా తెలుగువారందరికీ గర్వ కారణమని, ఇంత భారీ చిత్రం తెలుగు నుంచి రావడం..ఆనందంగా ఉందని చెప్పాడు.
ప్రభాస్, రానా, రాజమౌళిలపై ప్రసంశలు కురిపించాడు. ఈసినిమాతో ప్రభాస్, రానాలు తమ కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న నమ్మకం ఉందన్నాడు బన్నీ. ఇటీవలే చరణ్, మహేష్ బాబు కూడా బాహుబలికి ఇలాంటి కితాబులే ఇచ్చారు. ఇప్పుడు బన్నీ కూడా తోడయ్యాడు. ఇలా హీరోలంతా నెత్తిన పెట్టుకొంటే.. అందరి అభిమానులూ బాహుబలిని ఆశీర్వదిస్తే.. తెలుగు సినిమా చరిత్ర కనీ వినీ ఎరుగని స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం.