ఈసారి సరైనోడి రొమాంటిక్ ట్రైలర్ వస్తుందట..!
on Apr 15, 2016

అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా సరైనోడు. ఏప్రిల్ 22 న తెరపైకి రాబోతున్న ఈ సినిమాకు సాంగ్స్ ట్రైలర్స్ తో పాటు, మెయిన్ మూవీ ట్రైలర్ ను ఒకదాన్నే రిలీజ్ చేశారు. ఫుల్ ఫైట్స్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో నిండిపోయిన ఆ ట్రైలర్ చూసి మాస్ ఫ్యాన్స్ విజిల్స్ కొట్టినా, క్లాస్ ఆడియన్స్ కు మాత్రం ఇదేనా సినిమా అనే ఫీల్ తెప్పిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్, ప్రయోగాత్మక తెలుగు సినిమాలకు పట్టం కడుతున్నారు. కొద్దోగొప్పో రొమాంటిక్ జానర్ లా కనిపిస్తేనే వాళ్లకు నచ్చుతుంది. ఇదే మాట ఓవర్సీస్ బయ్యర్లు అల్లు అరవింద్ తో అన్నారట. అందుకే ఈ సారి రొమాంటిక్, కామెడీ ట్రైలర్ ను రిలీజ్ చేయాలని భావిస్తోంది సరైనోడు టీం. రీషూట్ అయిపోయిన సీన్స్ కూడా కలిపి, ఈ సారి మాంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. రాబోయే రెండు మూడు రోజుల్లో, కొత్త ట్రైలర్ ను కూడా వదిలేస్తారట. సో అల్లు ఫ్యాన్స్..గెట్ రెడీ
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



