'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాను!
on Jan 20, 2020
"మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు" అంటూ ఉద్వేగానికి గురయ్యాడు అల్లు అర్జున్. ఆదివారం రాత్రి వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో జరిగిన 'అల వైకుంఠపురములో' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బన్నీ తన సినిమా ఇండస్ట్రీ రికార్డును కొడుతున్నదనే విషయాన్ని ఒకవైపు చెబుతూనే, రికార్డులనేవి తాత్కాలికమనీ, ఫీలింగ్స్ శాశ్వతమనీ మరోవైపు చెప్పాడు. "నేను చాలా సినిమాలు చేశాను. అందులో నేను అది బాగా చేశాను, ఇది బాగా చేశానని చెప్తారు. కానీ నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఎవరు ఫోన్ చేసినా నా పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పారు. అంతటి గిఫ్ట్ నాకిచ్చారు త్రివిక్రమ్" అని తెలిపాడు బన్నీ.
తన తండ్రి ఎన్నో హిట్లు తీశారని చెబుతూ, "చిరంజీవి గారితో మా నాన్న కొల్లలుగా హిట్లు తీశారు. ఇండస్ట్రీ హిట్లు తీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. చరణ్‌తో 'మగధీర' తీసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. హిందీలో ఆమిర్ ఖాన్‌తో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. ఎప్పటికైనా మా నాన్నగారితో ఒక్క ఇండస్ట్రీ రికార్డ్ సినిమా కొట్టాలి అనుకొనేవాడ్ని. నిజంగా ఈ సినిమాతో ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ కొడుతున్నా. ఇది నాకు స్వీటెస్ట్ మెమరీ. మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు. ఇదొక్కటి చాలు.. థాంక్యూ సో మచ్. ఎవరితో రికార్డ్ కొట్టినా ఇంత ఆనందం సంపూర్ణంగా ఉండేది కాదు. మా మొత్తం ఫ్యామిలీ తరపున త్రివిక్రమ్ గారికి థాంక్స్" అన్నాడు అల్లు అర్జున్.
'అల వైకుంఠపురములో' సినిమా ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ సినిమాగా నిలవబోతోందని బన్నీ తెలిపాడు. "ఒక గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ శాశ్వతం. రికార్డులనేవి వెరీ వెరీ టెంపరరీ. ఇప్పుడు నేను కొడతాను, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొడతారు. అలా కొడుతూనే ఉంటారు. మీ మనసుకి ఎంజాయ్మెంట్ ఇచ్చాను కదా, అది అమూల్యమైంది. దానిముందు రికార్డులనేవి నథింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే రికార్డ్స్ ఆర్ టెంపరరీ, ఫీలింగ్స్ ఆర్ ఫరెవర్" అని చెప్పాడు బన్నీ.