సరైనోడు... సెకండాఫ్ గోవిందానా?!!
on Apr 18, 2016

ఈమధ్య బోల్డంత హైప్ తెచ్చుకొన్న సినిమాలు బాక్సాఫీసు ముందు మాత్రం బొక్కబోర్లా పడుతున్నాయి. అంచనాలు అందుకోలేక... అభిమానుల్ని నిరాశలో ముంచెత్తుతూ డిజాస్టర్ల జాబితాలో కలసిపోతున్నాయి. మొన్న అఖిల్ నిన్న.. బ్రూస్లీ ఈ రోజు.. సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితి ఇంతే కదా?? ఇప్పుడు సరైనోడు సినిమాపైనా విపరీతమైన బజ్ ఉంది. వరుసగా హిట్లతో రేసుగుర్రంలా దూసుకుపోతున్న అల్లు అర్జున్‌తో... లెజెండ్‌లాంటి సూపర్ డూపర్ హిట్టిచ్చిన బోయపాటి శ్రీను జతకలిశాడంటే ఆ అంచనాలు ఏ రేంజులో ఉంటాయో చెప్పక్కర్లెద్దు. దానికి తోడు ట్రైలర్లతోనే బోయపాటి భయపెట్టేస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీసు బొనాంజా కావడం ఖాయం అంటూ మెగా అభిమానులు లెక్కలేసుకొంటున్నారు.
అయితే... బన్నీ అభిమానులకు మాత్రం ఇది కాస్త టెన్షన్ పెట్టే వార్తే. సరైనోడు ఫస్టాప్ ఓ రేంజులో సాగిపోయిందట. హై ఓల్టేజీ యాక్షన్ సీన్లు.. బన్నీ అదిరిపోయే స్టెప్పులూ, డైలాగులతో వారెవా అనిపించాడట. ఇంట్రవెల్ ఫైట్ అయితే.. బన్నీ కెరీర్‌లోనే సూపర్బ్ అట. అయితే సెకండాఫ్ మాత్రం.. అనుకొన్నంత స్థాయిలో లేదని టాక్. ఫస్టాఫ్ ఎంత లేపాడో.. సెకండాఫ్ అంతగా కిందకు తొక్కేశాడని... రెండు వేర్వేరు సినిమాలు చూస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చిందని... ఈ సినిమాని చూసిన అతి కొద్ది మంది ఇచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవల ఈ సినిమా చూసిన చిరు.. సెకండాఫ్‌పై తనకున్న అభ్యంతరాలన్ని వ్యక్తం చేశాడట. దానికి తగ్గట్టుగానే 4 రోజుల పాటు రీషూట్ చేశారట. అయినా సరే... సెకండాప్‌లో ఏదో లోటు కనిపిస్తోందని టాక్. ఎన్టీఆర్ తో బోయపాటి శ్రీను తీసిన దమ్ము కూడా ఇంతే. ఫస్టాఫ్ ఓరేంజులో తీసుకెళ్లి.. సెకండాప్ ఢామ్మని కిందకు పడేశాడు. అందుకే సరైనోడు.. దమ్ము 2 అవుతుందా? అంటూ బన్నీ అభిమానులు ఇప్పుడు భయపడుతున్నారు. చిరంజీవి ఇచ్చిన సలహాలూ... బోయపాటి ఆఖరి నిమిషాల్లో చేసిన మార్పులే.. ఈ సినిమాని ఆదుకోవాలి. లేదంటే బన్నీ వరుస విజయాలకు బ్రేక్ పడినట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



