ఇన్నాళ్లకు..మన జేడీ ఇంటివాడవుతున్నాడు.!
on Apr 18, 2016
వర్మ స్కూల్ నుంచి నటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా, విలన్‌గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, దర్శకుడిగా ఇలా అన్ని యాంగిల్స్ చూపించిన జేడీ చక్రవర్తి పెళ్లి పీఠలెక్కనున్నాడు. ఇప్పుడు ఈతని వయసు 46 ఏళ్లు. ఈ వయసులో తన పెళ్లి విషయం ప్రస్తావించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాళ్లమ్మ గారి బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకున్నాడట. ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని జేడీ పెళ్లాడనున్నాడు. మరి కొన్ని నెలల్లో ఈ పెళ్లి జరగనుంది. నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత-మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పుడవి వచ్చాయని అనుకుంటున్నా అన్నాడు జేడీ. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ ఇంటివాడవుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



