అర్జునుడు సమరానికి సిద్ధం.. 'శ్యామ్ సింగ రాయ్', 'ఆర్ఆర్ఆర్' ఉన్నా తగ్గేదేలే!
on Dec 16, 2021

శ్రీవిష్ణు హీరోగా 'జోహార్' ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'అర్జున ఫల్గుణ'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ'తోనూ మెప్పిస్తాడన్న నమ్మకాన్ని టీజర్ కలిగించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
'అర్జున ఫల్గుణ' సినిమాని డిసెంబర్ 31 విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది. అయితే ఈసారి పెద్ద సినిమాల మధ్య విడుదల చేస్తూ శ్రీవిష్ణు రిస్క్ చేస్తున్నాడా అన్న అభిప్రాయం కలుగుతోంది. డిసెంబర్ 17 నుంచి వరుస సినిమాలు రానున్నాయి. అందులో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 17 న 'పుష్ప', డిసెంబర్ 24 న 'శ్యామ్ సింగ రాయ్', డిసెంబర్ 31 న '1945', జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్' సినిమాలు విడుదల కానున్నాయి. వారం ముందు 'శ్యామ్ సింగ రాయ్', వారం తర్వాత 'ఆర్ఆర్ఆర్'.. రిలీజ్ రోజున రానా '1945' సినిమాలు ఉన్నాయి. ఇంత పోటీ నడుమ 'అర్జున ఫల్గుణ' విడుదల చేస్తున్నారంటే మూవీ టీమ్ కి వాళ్ళ ప్రొడక్ట్ మీద ఉన్న నమ్మకం అలాంటిది అనుకోవాలేమో. అయినా ఈరోజుల్లో సినిమా బాగుందని టాక్ వచ్చి గట్టిగా వారంరోజులు ఆడితే చాలు కలెక్షన్లు వచ్చేస్తాయి. మరి శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ'తో అలాంటి మ్యాజిక్ చేసి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. నరేష్, శివాజీరాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్, రంగస్థలం మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



