పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ట్వీట్..కక్ష సాధింపులు మా దగ్గర ఉండవు
on Dec 2, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)ఈ నెల ఐదున వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ ఇవ్వగా,ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చెయ్యడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు తీసుకున్న ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల మరియు శ్రేయస్సు పట్ల మీకున్న బలమైన నిబద్ధతను తెలియజేస్తుంది.అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(pawan kalyan)గారికి కూడా నా దన్యవాదాలు.మీ సపోర్ట్ వల్ల చిత్ర పరిశ్రమమరింత బలోపేతమవుతుందంటూ ట్వీట్ చేసాడు.
పుష్ప 2 టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి ఏపి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో రాజకియాలు,సినిమా వేరని చెప్పినట్టయ్యింది. అల్లు అర్జున్ గత ఎన్నికల్లో వైసిపీ తరుపున పోటీ చేసిన శిల్ప రవిచంద్ర రెడ్డి కి మద్దతుగా వెళ్లిన విషయం తెలిసిందే.
Also Read