'పుష్ప-1'కి ఫుల్ రన్ లో 300 కోట్లు.. 'పుష్ప-2'కి ఫస్ట్ డే నే 300 కోట్లు!
on Dec 2, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప-2' భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా.. అన్ని చోట్లా బుకింగ్స్ కి అదిరిపోయే స్పందన లభిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. ఓపెనింగ్స్ పరంగా 'పుష్ప-2' సరికొత్త చరిత్ర సృష్టించేలా ఉంది. (Pushpa 2 The Rule)
'పుష్ప-2' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ అంచనా నిజమైతే ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజే రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన తొలి సినిమాగా 'పుష్ప-2' రికార్డు సృష్టించనుంది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలలో 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' మాత్రమే మొదటి రోజే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాయి. అలాంటిది ఇప్పుడు 'పుష్ప-2' ఏకంగా రూ.300 కోట్ల క్లబ్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్టవుతుంది.
నిజానికి 'పుష్ప-1' మూవీ ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అలాంటిది ఇప్పుడు 'పుష్ప-2' మూవీ మొదటిరోజే రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడమనేది మామూలు విషయం కాదు. అదే జరిగితే, ఇక ఫుల్ రన్ లో 'పుష్ప-2' ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో ఊహకు కూడా అందదు.