కోర్టులో అల్లుఅర్జున్ హాజరు
on Dec 27, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ్ గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.జరిగిన ఈ ఘోరానికి హీరో అల్లు అర్జున్(allu arjun)తో పాటు పుష్ప టీం రెండు కోట్ల రూపాయలని ఇచ్చింది.ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు(dil raju)అయితే రేవతి భర్తకి సినిమా ఇండస్ట్రీలోనే పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చాడు.
ఇక రేవతి కేసుకి సంబంధించి డిసెంబర్ 13న నాంపల్లి కోర్టు అల్లుఅర్జున్ కి రిమాండ్ విధించింది. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.దీంతో రిమాండ్ పూర్తి తర్వాత ప్రాసెస్‌లో భాగంగా అల్లుఅర్జున్ ఈ రోజు కోర్టులో హాజరు కానున్నాడు.ఈ సందర్భంగా పోలీసులు కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసారు.
ఈ కేసులో రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ని హై కోర్టు పర్మిషన్ తో పోలీసులు విచారణ చేసారు. ఆ సమయంలో తొక్కిసలాటకి సంబంధించిన వీడియోస్ ని అల్లు అర్జున్ కి చూపించగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురి కావడం జరిగింది.