Home

»

Latest News

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఒకే ఏడాది రెండు భారీ సినిమాల రిలీజ్.!

Aug 1, 2026 1:06PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు. ఒకే ఏడాది ఆయన రెండు భారీ పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి ఒక్కో సినిమా రావడానికి రెండేళ్ల సమయం పడుతోంది. అలాంటిది అల్లు అర్జున్ మాత్రం వచ్చే ఏడాది 2027లో ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించబోతున్నారు.

ఇటీవలే అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి యూరప్‌లో కొన్ని వారాల పాటు సాగిన వెకేషన్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. అలా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారో లేదో, వెంటనే తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'రాకా' కొత్త షూటింగ్ షెడ్యూల్ కోసం ముంబై చేరుకున్నారు. ముంబైలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజే ప్రారంభమైంది.

చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ 2026 చివరి నాటికే 'రాకా' సినిమాకి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించారు. 2027 సమ్మర్ తర్వాత ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ సిద్ధం చేశారు.

'రాకా' సినిమా పనులు పూర్తికాగానే, డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి భారీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టైల్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన పక్కా ప్లానింగ్‌తో, తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేయడంలో దిట్ట. అల్లు అర్జున్ సినిమాను కూడా వేగంగా పూర్తి చేసేలా లొకేష్ తన మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2027 డిసెంబర్ నాటికి ఈ విజువల్ వండర్‌ను థియేటర్లలోకి తీసుకురావాలని డెడ్‌లైన్ పెట్టుకున్నారు.

మొత్తానికి ఒకే ఏడాదిలో రెండు భారీ సినిమాలతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

Allu Arjun, Raaka Movie, AA23 Movie

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com