
అఖిల్ అక్కినేని(Akhil Akkineni)గత నెల జూన్ 10 న లెనిన్(Lenin)గా సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. పది సంవత్సరాల తన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో లెనిన్ ని అఖిల్ తో పాటు అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. వరుస ప్లాప్స్ తో ఫ్రెండ్ షిప్ చేస్తున్న భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse)కూడా లెనిన్ ని మరిచిపోవడం అనేది జరగదు.
90 కోట్ల రూపాయల వరకు వసూళ్లని సాధించిన లెనిన్ ఓటీటీ హక్కుల విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను దాదాపు 40 కోట్ల రూపాయలకు దక్కించుకోవడం సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రతి సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టర్లు రిలీజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ‘లెనిన్’ నిర్మాతలు అనుసరించిన సరికొత్త పబ్లిసిటీ వ్యూహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చిత్రబృందం సాంప్రదాయ సోషల్ మీడియా ప్రకటనలకి భిన్నంగా, ఒక ప్రముఖ ప్రముఖ వార్తాపత్రికలో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి జీ5 ప్లాట్‌ఫారమ్‌లో ‘లెనిన్’ స్ట్రీమింగ్ కానుందని ఆ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. పత్రికా ప్రకటన రూపంలో ఓటీటీ ముహూర్తాన్ని ఖరారు చేయడం టాలీవుడ్ చరిత్రలోనే ఒక వినూత్నమైన ప్రయోగంగా నిలిచింది. ఈ పేపర్ యాడ్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్‌గా మారాయి. అక్కినేని అభిమానులు, సినీ ప్రియులు ఈ సృజనాత్మక ప్రచారాన్ని ఎంతో ఆసక్తిగా పంచుకుంటున్నారు.
Also read: అగస్ట్ లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సందడి.. మనల్ని ఎవడ్రా ఆపేది
థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తయిన నాలుగు వారాల వ్యవధిలోనే, అంటే స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ఈ చిత్రం డిజిటల్ ప్రసారానికి సిద్ధమవుతోంది. థమన్ అందించిన నేపథ్య సంగీతం, మురళీ కిషోర్ దర్శకత్వ ప్రతిభ కలిసి లెనిన్ ని ఓటీటీ వేదికగా కూడా సరికొత్త రికార్డుల వైపు నడిపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Akhil Akkineni, Bhagyashri Borse, Nagarjuna






